Skyscraper left
Skyscraper Right

యాత్ర మూవీ రివ్యూ..

టైటిల్ : యాత్ర
నటీనటులు : మమ్ముట్టి, రావు రమేష్, అనసూయ, సుహాసిని తదితరులు..
సంగీతం : కె. కృష్ణ కుమార్
నిర్మాత : విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి,
రచన దర్శకత్వం : మహి.వి. రాఘవ
విడుదల తేదీ : ఫిబ్రవరి 08, 2019

వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రగా ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి రాఘవ దర్శకత్వంలో యాత్ర సినిమా నేడు థియేటర్స్ కి వచ్చింది.. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా లో ముఖ్యంగా పాదయాత్ర సీన్స్ హైలైట్స్ అవుతాయని ముందునుంచి చెప్తున్న మాట.. ఇప్పటికే పలు బయోపిక్ సినిమాలు వచ్చి వెండితెరపై ప్రేక్షకులను అలరించగా ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం..

కథ విషయానికొస్తే,
సినిమా లో కథ అంటూ పెద్ద గా ఏమీ లేదు.. వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలను ఈ సినిమా లో చూపించే ప్రయత్నం చేశారు.. అధికారంలో ఉన్న అత్యంత బలమైన ప్రభుత్వాన్ని, వైఎస్సార్ ఎలా ఒంటరిగా ఎదుర్కొని ప్రజా సమస్యలను తెలుసుకుని వారికి అండగా నిలిచాడన్నదే ఈ సినిమా కథ.. పాదయాత్ర లో ప్రజల కష్టాలను తెలుసుకుని మాములు నేతనుంచి ఓ మహానేత గా ఎలా మరేడో చూపించే ప్రయత్నం చేసిన సినిమా నే ఈ ‘ యాత్ర’

నటీనటులు :

వైఎస్ పాత్రలో మలయాలనటుడు మమ్మిట్టి పరకాయ ప్రవేశం చేశాడు.. అచ్చం ఆయనలాగే హావభావాలు పలికించి రాజశేఖర్ రెడ్డి ని మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేసి చాల సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.. ఆద్యంతం ఎమోషన్ తో కూడిన సన్నివేశాలలో తనదయిన స్టైల్ జోడించి వైఎస్సార్ మ్యానరిజం జోడించి అద్భుతంగా నటించాడు.. ఇతరులు తమ పాత్ర ల మేరకు బాగానే నటించిన పెద్దగా స్కోప్ లేకపోవడం తో వారు నటించే ఆస్కారం అంతగా రాలేదు.. అనసూయ, పృథ్వి, సుహాసిని, రావు రమేష్ లు ఎప్పటిలాగే పర్వాలేదనిపించారు..

సాంకేతిక నిపుణులు :
వైఎస్సార్ ఎమోషన్స్ ని ఆయనకు తగ్గట్లుగా గ్రాబ్ చేయడం డైరెక్టర్ కె చెల్లింది.. ఒక హారర్ సినిమా తీసి వెంటనే ఇలాంటి బయోపిక్ సినిమా చేయడం అది కూడా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమా ని రూపొందించడం చూస్తుంటే టాలీవుడ్ కి మరో మంచి డైరెక్టర్ దొరికినట్లే అనిపిస్తుంది.. సినిమా హిట్ విషయం లో సగం క్రెడిట్ డైరెక్టర్ కె వెళ్తుంది.. సన్నివేశాలను భావోద్వేగాల కనుగుణంగా చాలా బాగా అల్లాడు.. కొన్ని కొన్ని ఎమోషన్స్ సీన్స్ లో పాతతరం దర్శకులను గుర్తు చేశాడు.. అన్ని విభాగాల్లో సాంకేతిక నిపుణులు ఆకట్టుకున్నారు.. చివర్లో ఎమోషనల్ సీన్స్ చాలా బాగా ఆకట్టుకుంది..

ప్లస్ పాయింట్స్ :

మమ్ముట్టి

మహి వి రాఘవ డైరెక్షన్

రీ రికార్డింగ్

మైనస్ పాయింట్స్ :

మొదటిభాగం లో సాగతీత సన్నివేశాలు
అన్ని పాత్రలను ఎలివేట్ చేయకపోవడం

మొత్తానికి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర గా వచ్చిన యాత్ర చిత్రం అభిమానులనే కాకుండా సామాన్య ప్రజలను సైతం ఆకట్టుకునేలా ఉంది.. అటు కమర్షియల్ గా, ఎమోషనల్ గా యాత్ర సమతూకంతో ఉంది.. సినిమా లో మెయిన్ గా మమ్ముట్టి నటన, మహి వి రాఘవ డైరెక్షన్ హైలైట్ అని చెప్పొచ్చు..

రేటింగ్ : 3/5

Leave A Reply

Your email address will not be published.