Skyscraper left
Skyscraper Right

మెగా ఫాన్స్ కి షాక్.. సైరా షూటింగ్ మరింత ఆలస్యం..!!

ఇప్పటికే నత్తనడకన సాగుతోంది సైరా సినిమా షూటింగ్. బడ్జెట్ ప్రాబ్లమ్ లేదు. నిర్మాత కూడా సొంత కొడుకే. దర్శకుడు కూడా చెప్పినట్టు వినే మనిషి. అందుకే చిరంజీవి నిదానంగా ఈ సినిమా షూటింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు సైరా మరింత ఆలస్యం కాబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. అవును.. ఈ సినిమాలో చాలా సన్నివేశాల్ని రీషూట్ చేయాల్సిందిగా చిరంజీవి ఆర్డర్ వేశారట.

ఫ్లాపుల్లో సాయిధరమ్ తేజ్.. పవన్ దారిలో..!!

నిజానికి సైరాకు రీషూట్స్ కొత్తకాదు. ఇప్పటికే ఓసారి రీషూట్ మోడ్ లోకి వెళ్లారు. అలా చేయడం వల్ల కాల్షీట్లతో పాటు చాలా డబ్బు కూడా ఖర్చయింది. కానీ మేకింగ్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావట్లేదు రామ్ చరణ్. అందుకే ఇప్పుడు మరోసారి రీషూట్స్ కు వెళ్తున్నారు.

ఆ రోజు నాకు నరకం చూపించారు – రష్మీ..!!

నిజానికి సినిమాకు సంబంధించి చాలా సన్నివేశాల్ని షూటింగ్ టైమ్ లోనే చిరంజీవి ఓకే చేస్తున్నారు. అలా ఒకే చేసిన సన్నివేశాల్ని కూడా ఎడిటింగ్ తర్వాత నచ్చక తొలిగిస్తున్నారు. అలా తొలిగించిన సీన్స్ స్థానంలోనే ఇప్పుడు మళ్లీ రీషూట్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను సమ్మర్ తర్వాత విడుదల చేస్తామని నిర్మాత రామ్ చరణ్ గతంలో చెప్పాడు. కానీ ఇప్పుడీ సినిమా ఈ ఏడాది వస్తుందా అనేది అనుమానంగా ఉంది. తాజా సమాచారం ప్రకారం, దసరా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారట.

వెంకీ , వీరి పోట్ల సినిమా లేనట్లేనా..!!

Leave A Reply

Your email address will not be published.