Skyscraper left
Skyscraper Right

షూటింగ్ లో ప్రమాదానికి గురైన విశాల్…పరిస్థితి తీవ్రతరం..!!

తెలుగువాడైన విశాల్ తమిళ సినీ పరిశ్రమలో తనదైన ఇమేజ్ సంపాదించుకున్నాడు. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా డ్యుయెల్ రోల్ పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సీ. సుందర్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. టర్కీలోని కాప్పడోసియా అనే ప్రాంతంలో తన తాజా చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు విశాల్ . అక్కడి రోడ్లపై భారీ యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా విశాల్‌ బైక్‌ అదుపుతప్పి పడిపోయారు. విశాల్ కాలు, చేయి విరిగినట్లు సమాచారం. కాలు, చేతికి బ్యాండేజ్ తో ఉన్న విశాల్ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. రిస్కీ ఫైట్ అయినప్పటికి ఎలాంటి డూప్ లేకుండా విశాల్ ఈ ఫైట్ చేయగంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

మహర్షి మూవీ బడ్జెట్ గాడి తప్పిందా.. అందుకే ఇంత లేట్..!!

గతంలో ‘తుప్పరివాలన్’ సినిమా షూటింగ్ లో కూడా ఈ హీరో గాయపడ్డాడు. ఇక విశాల్ తాజాగా నటించిన ‘అయోగ్య’ సినిమా మే 10న ప్రేక్షకుల ముందు రానుంది. ఇందులో విశాల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతోంది. తెలుగులో ఎన్టీఆర్‌కు సూపర్ హిట్ ఇచ్చిన ఈ సినిమా తమిళంలో విశాల్‌కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. యాక్షన్ సన్నివేశంలో విశాల్ డూప్ లేకుండా నటించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. చేయి, కాలుకు కట్టు కట్టి ఉన్న ఫోటోను సినీ విశ్లేషకుడు రమేష్ బాలా తన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేశారు. విశాల్‌కు ప్రమాదం జరిగి వెంటనే యూనిట్ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారని తెలిపారు. ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన అనీశా యువతితో నిశ్చితార్థం జరిగింది.

త్రివిక్రమ్ సినిమా తో మళ్ళీ బిజీ కానున్న అల్లు అర్జున్..!!

Leave A Reply

Your email address will not be published.