Skyscraper left
Skyscraper Right

కూతురు డాన్స్ కి మహేష్ ఫిదా..వాట్ ఏ టాలెంట్ అంటూ ప్రశంశ..!!

మహేష్ బాబు కుమార్తె సితార అంటే సోషల్ మీడియాలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఎప్పుడో హుషారుగా, చెలాకీగా ఉంటుంది సితార. మహేష్ కూడా ఆమెకు సంబదించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా సితార బాహుబలి చిత్రంలోని కన్నా నిదురించరా పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన మహేష్ ఆమె ప్రతిభ చూసి వాట్ ఏ టాలెంట్ అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. అభిమానులు సైతం సితార క్యూట్ స్టెప్పులు చూసి ముచ్చటపడిపోతున్నారు.

మోస్ట్ డిజైరబుల్ వుమెన్ గా అతిధి రావు హైదరి..!!

నిజంగానే సితార సూపర్‌ టాలెంటెడ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటివరకు ట్విటర్‌లో ఈ వీడియోకు 44 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. సితారకు భరతనాట్యంలోనూ ప్రావిణ్యం ఉంది. గజ్జెలు కట్టుకుని ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌గా చాలా బాగా నాట్యం చేస్తుందంటూ ఇటీవల మహేశ్‌ సతీమణి నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. కొంతకాలం క్రితం సితారను నృత్య శిక్షణలో చేర్పించినట్లు నమ్రత పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ సాంప్రదాయ నృత్యకారులైన అరుణ భిక్షు దగ్గర సితార నృత్యం నేర్చుకుంటూ ఇప్పటికే ఫస్ట్ లెవల్ విజయవంతంగా పూర్తి చేసింది. తన ముద్దుల కూతురి అభినయిస్తూ చేసిన ఈ నృత్యానికి ఫిదా అయిపోయిన మహేష్ తన ట్విట్టర్ ఖాతాతో ఈ వీడియోను పోస్ట్ చేయగా వైరల్‌గా మారిపోయింది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ నుంచి మరో పాట విడుదల..!!

Leave A Reply

Your email address will not be published.