Skyscraper left
Skyscraper Right

మోస్ట్ డిజైరబుల్ వుమెన్ గా అతిధి రావు హైదరి..!!

బాలీవుడ్‌లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అదితిరావ్ హైదరీ..సమ్మోహనం చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన ఈ అందాల భామ నటనకి తెలుగు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. ‘సమ్మోహనం‌’తో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీతర్వాత ‘అంతరిక్షం’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా అదితి రావు హైదరి మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2018గా ఎంపికైంది. తొలి స్థానం ఈ అమ్మడికి దక్కగా రెండో స్థానంలో ఎఫ్‌బీబీ కలర్స్ ఫెమీనా మిస్ ఇండియా 2018 శ్రియా రావు నిలిచింది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ లైన్ క్లియర్.. రిలీజ్ డేట్ మార్పు..!!

టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అంటూ టైమ్స్ గ్రూప్ తయారు చేసిన జాబితాలో సమంత మూడో స్థానంలో నిలిచింది. మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2017 లో తొలి స్థానం దక్కించుకున్న పూజా హెగ్డేకి ఈ సారి నాలుగో స్థానం దక్కింది. ఐదు రష్మిక, ఎనిమిది కైరా అద్వానీ, తొమ్మిది రకుల్‌, పదవ స్థానంలో కాజల్ అగర్వాల్ నిలిచింది. ప్రస్తుతం ఆమె సైకో అనే తమిళ చిత్రంలో నటిస్తుంది. ఉదయనిధి స్టాలిన్ హీరో గా నటిస్తున్న ఈ చిత్రం నిత్యామీనన్ మరో కథానాయికగా నటిస్తుండగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది.. విశాల్ తో డిటెక్టివ్ వంటి ఇంటెలిజెంట్ సినిమా చేసిన మిస్కిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు..

నాగబాబు కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా – శివాజీ రాజా..!!

Leave A Reply

Your email address will not be published.