Skyscraper left
Skyscraper Right

స్టార్ హీరో కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్..!!

కన్నడ హీరో, ఈగ ఫేమ్ కిచ్చా సుదీప్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కాఫీ ఎస్టేట్‌ వివాదంలో కోర్టుకు గైర్హాజరు కావడంతో ఆగ్రహించిన కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. చిక్‌మంగళూరు కోర్టులో వరుస వాయిదాలతో అవకాశమిచ్చినా ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాకపోవడంతో సుదీప్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.. తెలుగులో రాజమౌళి ఈగ సినిమాలో విలన్ గా అదరగొట్టేసాడు . తాజాగా బాలీవుడ్ దబాంగ్ సీక్వెల్ లోనూ నటిస్తున్న సుదీప్ కి ఒక కేసు మెడకు చుట్టుకుంది. అయితే ఆ కేసులో కోర్టుకి హాజరవకుండా తిరుగుతుండటంతో సుదీప్ ఇప్పుడు తప్పకుండా కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చిక్‌మంగళూరు జేఎంఎఫ్సీ కోర్టు సుదీప్ ఒక్కసారి కూడా కోర్టుకి హాజరు కాకపోవడంతో సుదీప్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

మహర్షి మూవీ బడ్జెట్ గాడి తప్పిందా.. అందుకే ఇంత లేట్..!!

ఇంతకి విషయ ఏంటంటే.. కర్ణాటక చిక్‌మంగళూరులోని కాఫీ ప్లాంటేషన్ ఓనర్ దీపక్ పటేల్ సుదీప్ పై ఈ కేసు పెట్టాడు. కన్నడ టీవీ రియాలిటీ వారసదార అనే షో కోసం తన ప్రాపర్టీని, కాఫీ తోటల్ని ధ్వంసం చేసినందున ఆ కాఫీ ఎస్టేట్ ఓనర్ కేసు వేసాడు. తనకు కోటిన్నర నష్టం జరిగిందని ఆయన కేసు వెయ్యగా మధ్యవర్తిత్వంతో ఆ కేసు సెటిల్మెంట్ చేసుకుందామనుకుంటే దీపక్ పటేల్ మాత్రం ససేమిరా అనడం, ఆ కేసు విచారణకు వచ్చినప్పుడల్లా సుదీప్ కోర్టుకి హాజరవకుండా తప్పించుకుని తిరగడంతో కోర్టు సుదీప్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎలాగైనా సుదీప్ ని పట్టుకుని కోర్టులో హాజరుపరచాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. మరి చివరికి సుదీప్ కోర్టు మెట్లెక్కాల్సి వచ్చేలా కనబడుతుంది.

షూటింగ్ లో ప్రమాదానికి గురైన విశాల్…పరిస్థితి తీవ్రతరం..!!

Leave A Reply

Your email address will not be published.