Skyscraper left
Skyscraper Right

ఎన్నికల వేల ఆసక్తికరంగా నరేంద్రమోడీ బయోపిక్ ట్రైలర్..!!

బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పీఎం నరేంద్రమోదీ’. భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత నేపథ్యంలో దర్శకుడు ఒమంగ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్ కు భిన్న స్పందనలు వినిపించాయి.

వెంకీ , వీరు పోట్ల సినిమా లేనట్లేనా..!!

తాజాగా “పీఎం నరేంద్ర మోదీ : స్టోరీ ఆఫ్ ఏ బిలియన్ పీపుల్” ట్రైలర్ విడుదలైంది. నరేంద్ర మోదీ బాల్యం, రైళ్లలో టీ అమ్మిన దృశ్యాలు, ఆర్ఎస్ఎస్ లో చేరడం, గోద్రా అల్లర్లు, మోదీని ఇందిరాగాంధీ అరెస్ట్ చేయించడం, ఆపై ఆయనపై ప్రజల్లో పెరిగిన నమ్మకం, ప్రధానిగా ఎన్నికకావడం, ప్రధానిగా విదేశీ పర్యటనలు తదితరాలను చూపించారు. దర్శన్‌ కుమార్, బొమన్‌ ఇరానీ, మనోజ్‌ జోషీ, ప్రశాంత్ నారాయణన్‌, జరీనా వాహబ్‌, సేన్‌ గుప్తా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. “ఒక చాయ్ వాలా. ప్రధాని అవుతాడా?”, నేను సన్యాసిని కావాలని అనుకుంటున్నాను, దేశం కావాలని అనుకునేవారికి మరేమీ అవసరం లేదు, ఆటంకవాదులను చూసి హిందుస్థాన్ కాదు. హిందుస్థాన్ ను చూసి ఆటంకవాదులు భయపడతారు, ఒక్క నిమిషంలో నిర్ణయం తీసుకోకుంటే. అది అసలు నిర్ణయమే కాదు అన్న అర్థం వచ్చేలా హిందీలో ఉన్న డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. వచ్చే నెల 5 న సినిమా భారీ ఎత్తున 23 భాషల్లో విడుదల కానుంది.

మెగా ఫాన్స్ కి షాక్.. సైరా షూటింగ్ మరింత ఆలస్యం..!!

Leave A Reply

Your email address will not be published.