Skyscraper left
Skyscraper Right

ఫ్లాపుల్లో సాయిధరమ్ తేజ్.. పవన్ దారిలో..!!

నటుడు సాయి ధరమ్ తేజ్ వరుసగా ఫ్లాప్స్ వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మనోడి కెరీర్ పై ఎక్కడ ప్రభావం పడుతుందో అని భయపడి స్నేహితులు, సన్నిహితులు చెప్పిన మాట వింటున్నాడేమో. అతను తన నెక్స్ట్ సినిమా నుండి స్క్రీన్ నేమ్ మార్చుకోనున్నాడు. న్యూమరాలజీ మీద నమ్మకంతో తన పేరు మార్చుకుంటున్నాడు. సాయి తేజ్ అన్నది కొత్త స్క్రీన్ పేరు. త్వరలోనే రాబోయే చిత్రలహరి టైటిల్స్ లో ఈ విధంగానే ఉండబోతోంది. మెగాస్టార్ అసలు పేరు కొణిదెల శివ శంకర వరప్రసాద్.

కూతురు డాన్స్ కి మహేష్ ఫిదా..వాట్ ఏ టాలెంట్ అంటూ ప్రశంశ..!!

అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత చిరంజీవి గా పేరు మార్చుకోగా, కళ్యాణ్ బాబు గా పరిచయమైన పవర్ స్టార్ తర్వాత పవన్ కళ్యాణ్‌ గా పేరు మార్చుకున్నారు. పేరు మార్చుకున్న ఈ ఇద్దరూ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోలుగా ఎదిగారు. అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పేరు మార్చుకున్నాడు.. అయన అసలు పేరు రామ్ చరణ్ తేజ్. అయితే లక్ కలిసి రావాలనే తన పేరు నుంచి ‘తేజ్’ అనే పదాన్ని తొలగించిన సంగతి తెలిసిందే. సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ వారు నిర్మిస్తోన్న మూవీ ‘చిత్రలహరి’. సాయిధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఏప్రిల్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఆ రోజు నాకు నరకం చూపించారు – రష్మీ..!!

Leave A Reply

Your email address will not be published.