Skyscraper left
Skyscraper Right

వెంకీ , వీరు పోట్ల సినిమా లేనట్లేనా..!!

వీరు పోట్ల దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమా చేయబోతున్నాడట. అది కూడా మల్టీస్టారర్. అందులో వెంకీతో పాటు రానా లేదా రవితేజ హీరోగా నటించే ఛాన్స్ ఉందట. 2 రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన పుకారు ఇది. దీనిపై వీరుపోట్ల క్లారిటీ ఇచ్చాడు. అసలు అలాంటి ప్రాజెక్టు లేదని కొట్టిపారేశాడు.

ఫ్లాపుల్లో సాయిధరమ్ తేజ్.. పవన్ దారిలో..!!

వీరుపోట్ల కొట్టిపడేసినా ఇందులో కాస్త నిజముంది. నిర్మాత అనీల్ సుంకరకు వెంకీ ఓ సినిమా చేసిపెట్టాలి. ఈ మేరకు అనీల్ సుంకర ఇచ్చిన అడ్వాన్స్ వెంకీ వద్ద ఉంది. ఇందులో భాగంగా తేజతో సినిమా అనుకుంటే అది రద్దయింది. మధ్య లో వీరభద్రమ్ చౌదరితో ఓ సినిమా అనుకున్నారు. అది కూడా కార్యరూపం దాల్చలేదు. రీసెంట్ గా అనీల్ సుంకర రిఫరెన్స్ తో వీరుపోట్ల కూడా వెళ్లి వెంకీకి ఓ కథ చెప్పాడు.జస్ట్ ఇక్కడివరకు మాత్రమే మేటర్ నడించింది. అంతలోనే ఓ సెన్షన్ మీడియా ఏవేవో కథలు అల్లేసింది. నిజానికి వెంకీకి వీరుపోట్ల చెప్పింది మల్టీస్టారర్ కథ కాదట. ఆ సంగతి పక్కనపెడితే, వీరుపోట్ల చెప్పిన లైన్ కు వెంకీ నో చెప్పాడట. అందుకే తను వెంకీకి ఎలాంటి స్టోరీ చెప్పలేదంటూ కవర్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు వీరు పోట్ల.

ఆ రోజు నాకు నరకం చూపించారు – రష్మీ..!!

Leave A Reply

Your email address will not be published.