Skyscraper left
Skyscraper Right

కళ్యాణ్ రామ్ 118 మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!!

సినిమా : 118
బ్యానర్ : ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్..
నటీనటులు : కళ్యాణ్ రామ్, నివేద థామస్, షాలిని పాండే, నాజర్, రాజీవ్ కనకాల తదితరులు..
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
దర్శకుడు మరియు ఛాయాగ్రహణం : కె.వి.గుహన్
నిర్మాత : మహేష్ ఎస్.కోనేరు
విడుదల తేదీ : 1 మార్చి 2019
వరుస ఫ్లాప్ లతో సతమవుతూ సరైన హిట్ కోసం పరితపిస్తున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నేడు 118 అనే సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.. పటాస్ తర్వాత ఆ స్థాయిలో హిట్ దక్కించుకోలేకపోయిన కళ్యాణ్ రామ్ రెగ్యులర్ గా కాకుండా ఈ సారి సస్పెన్ థ్రిల్లర్ ని ఎంచుకోవడం విశేషం.. సినిమాటోగ్రాఫర్ గా హిట్ సినిమా లు చేసిన కెవి గుహన్ ఈ దర్శకత్వం వహించగా, ఈ సినిమా అయినా కళ్యాణ్ రామ్ హిట్ కు దోహదపడిందా లేదా అనేది ఈ సమీక్షలో తెలుసుకుందాం…
కథ విషయానికొస్తే,
గౌతమ్ (కళ్యాణ్ రామ్) ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్..  అయితే ఓ రోజు గౌతమ్ కలలో ఆద్య (నివేద థామస్) అనే అమ్మాయి కనిపిస్తుంది. ఆమెను కొంతమంది దుండగులు ఆమెను చంపేందుకు స్కెచ్ వేస్తారు. ఆద్య ప్రయాణిస్తున్న కారును లోయలోకి తోసేస్తారు. తొలుత ఈ డ్రీం ని తేలికగా తీసుకున్న కళ్యాణ్ రామ్ కి తన కలలో వచ్చిన సన్నివేశాలు నిజ జీవితంలో జరగడం మొదలవుతాయి.. దాంతో ఇంతకీ ఆ అమ్మాయి నిజంగానే ఉందా అనే అనుమానం తనలో మొదలవుతుంది.. ఈ క్రమంలో ఆద్య ని కనిపెట్టే ప్రయత్నంలో గౌతమ్ ఎలాంటి పరిస్థితులు ఎదురుకున్నాడు.. చివరికి గౌతమ్ ఆమెని కలిశాడా లేదా అనేది సినిమా కథాంశం..
నటీనటులు :
కళ్యాణ్ రామ్ ఇప్పటివరకు చేయని జోన్ లో నటించి మెప్పిచాడు. ఎప్పుడు మాస్ మసాలా స్టోరీ తో డైలాగ్స్ చెప్పి, విసిగెత్తిపోయిన ప్రేక్షకులు ఈ టైపు యాక్షన్ కళ్యాణ్ రామ్ లో ఉందా అని ఆశ్చర్యపోయారు.. ఎంతో జోవియల్ గా, క్యూరియాసిటీ గా కనిపిస్తూ డిఫరెంట్ లుక్ కనిపించాడు.. నివేద ఆద్య క్యారక్టర్ లో ఒదిగిపోయింది.. తన లో హావభావాలు స్పష్టంగా కనిపించాయి. ఎమోషనల్ సీన్స్ లో మంచి పరిణితి కనిపించింది. మరో హీరోయిన్ షాలిని పాండే ఎక్కువగా కనిపించకపోయినా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇతర నటీనటులు పర్వాలేదనిపించారు.
సాంకేతిక నిపుణులు :
ఈ సినిమా కథ చాల బాగుంది.. అయితే ఫస్ట్ హాఫ్ ని తీసుకెళ్లినంత ఇంట్రెస్ట్ గా సెకండ్ హాఫ్ ని తీసుకెళ్లలేకపోయాడు.. సెకండ్ హాఫ్ అంతా లాజిక్ కి దూరం గా ఉంటూ నమ్మలేని స్థితిలో ఉండడంతో ప్రేక్షకుడు నిరాశపడి ఉండొచ్చు.. తాను ఇన్వెస్టిగేట్ చేస్తున్న పరిశోధనలో క్లూస్ అన్ని కలలో కనపడడంతో ప్రేక్షకుడికి అంత కురియాసిటీ అనిపించదు. కాన్సెప్ట్ మంచిదే అయినా స్క్రీన్ ప్లే ని దానికి తగ్గట్లు సిద్ధం చేసుకోలేకపోయాడు.. ఇక స్వతహాగా కెమెరామెన్ అయినా గుహన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చాల నాణ్యమైనవిగా ఉన్నాయి.. శేఖర్ చంద్ర పాటలతో ఆకట్టుకోలేకపోయినా నేపథ్య సంగీతంలో మెప్పించాడు.. జోనర్ తగ్గ మ్యూజిక్ ఇచ్చి సస్పెన్స్ ని క్రియేట్ చేశాడు.. నిర్మాణ విలువలు చాల బాగున్నాయి..
ప్లస్ పాయింట్స్ :
కళ్యాణ్ రామ్..
సినిమాటోగ్రఫీ..
ఫస్ట్ హాఫ్
మైనస్ పాయింట్స్ :
స్టోరీ
స్క్రీన్ ప్లే
స్లో నేరేషన్
ఫైనల్ గా… కళ్యాణ్ రామ్ ట్రై చేసిన ఈ జోనర్ కొంచెం కొత్తగా ఉండడంతో సినిమా ఒకసారి చూడొచ్చు.. కానీ అక్కడక్కడా బోర్ కొడుతుంది.. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాల స్లో గా, సాగతీతగా ఉండడంతో ప్రేక్షకుడు ఎక్కువ సేపు కూర్చోవడానికి ఇష్టపడడు..బిసి సెంటర్స్ ఆడియన్స్ ని ఈ సినిమా ఆకట్టుకుంటుంది..
Rating : 2/5

Leave A Reply

Your email address will not be published.