Skyscraper left
Skyscraper Right

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ…!!

టైటిల్ : లక్ష్మీస్ ఎన్టీఆర్..
నటీనటులు : విజయ్ కుమార్‌, యజ్ఞ శెట్టి, శ్రీ తేజ్‌.. తదితరులు
దర్శకుడు : రామ్ గోపాల్ వర్మ,అగస్త్య మంజు
నిర్మాత : రాకేష్‌ రెడ్డి, దీప్తి బాలగిరి
మ్యూజిక్ : కళ్యాణి మాలిక్
సినిమాటోగ్రఫీ : రమ్మీ
రిలీజ్ డేట్ : మార్చి 29 2019

ఏపీ మాజీ ముఖ్యమంత్రి , తెలుగు వెండితెర దైవం నందమూరి తారక రామారావు జీవిత కథలోని కొన్ని సంఘటలన ఆధారంగా వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ జీవితంలోకి ఆయన రెండో భార్య లక్ష్మీ పార్వతీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఈ సినిమా నిర్మిచడం జరిగింది. ఎన్టీఆర్ తన చివరి రోజుల్లో ఎలాంటి దుర్భర జీవితాన్ని గడిపాడో తన సినిమాలో చూపిస్తానంటున్నాడు వర్మ. మరి ఈరోజే ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఈమేరకు మెప్పించిందో చూద్దాం..

కథ :

ఇది విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ జీవిత కథ. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతీ ఏపీసోడ్ ఆధారంగా తెరకెక్కిన కథ. లక్ష్మీ పార్వతీ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్మ చెప్పిన కథ. 1989 తర్వాత అధికారం కోల్పోయి, కుటుంబం, నేతలు, స్నేహితులు, సన్నిహితులు దూరమై ఎన్టీఆర్ (విజయ్ కుమార్) ఒంటరిగా మానసిక క్షోభను అనుభవిస్తున్న సమయంలో తన జీవిత చరిత్రను రాయడానికి లక్ష్మీపార్వతి (యజ్ఞశెట్టి) ఆయన గడపలోకి ప్రవేశిస్తుంది. లక్ష్మీపార్వతి మాటలు, వ్యక్తిత్వం వల్ల ఆమెకు ఆయన దగ్గరవుతాడు.

ఇది బాబు (శ్రీ తేజ్)కు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు సహించదు. ఎన్టీఆర్‌ నుంచి లక్ష్మీ పార్వతీని దూరం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. కానీ, అవి ఫలించవు. పైగా ఎన్టీఆర్ కు లక్ష్మీపార్వతి మరింత చేరువవుతుంది. ఆమెని పెళ్లి కూడా చేసుకొంటాడు. లక్ష్మీ పార్వతీపై వ్యతిరేకతని ఆసరాగా చేసుకొని చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడు అనే అంశాన్ని హైలైట్ చేస్తూ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని తెరకెక్కించారు.

నటీనటులు :

పాత్రల ఎంపిక విషయంలో వర్మ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ఎన్టీఆర్ గా పి. విజయ్ కుమార్ అనే వ్యక్తిని తీసుకోవడంతోనే వర్మ సగం సక్సెస్ అయ్యాడు. విజయ్ నటన అచ్చు ఎన్టీఆర్ ను తలపించింది. అటు లక్ష్మి పార్వతి పాత్రలో నటించిన యజ్ఞాశెట్టి జీవించింది. బాబు పాత్ర చేసిన శ్రీతేజ్ సినిమాకు హైలైట్ గా నిలిచాడు. మిగతా పాత్రల్లో ఇతర నటులు మెప్పించారు.

సాంకేతిక నిపుణులు :

ఎన్టీఆర్‌, లక్ష్మీ ల మధ్య సన్నివేశాలను వర్మ తెరకెక్కించిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఏదేమైనా ఈ మధ్య కాలంలో వర్మ తీసిన సినిమాల్లో ఇది మంచి సినిమా అనే చెప్పుకోవాలి. పాత్రల ఎంపికతోనే సగం విజయం సాదించిన వర్మ.. వారి నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకోవటంలోనూ సక్సెస్‌ అయ్యాడు. ప్రతీ నటుడు తన పాత్రలో లీనమై నటించారు. సినిమాకు మరో ప్లస్ పాయింట్ కల్యాణ్ మాలిక్ సంగీతం. సన్నివేశాల స్థాయికి పెంచాడు మాలిక్. ఎమోషనల్‌ సన్నివేశాల్లో సంగీతం ప్రేక్షకులను కన్విన్స్ చేసే విధంగా ఉండటం విశేషం. ఇక రీరికార్డింగ్ గురించి చెప్పుకుంటే తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సన్నివేశాలను తర్వాతి స్థాయికి తీసుకెళ్లాడు సంగీత దర్శకుడు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

కళ్యాణి మాలిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
ఎన్టీఆర్ గా విజయ్‌ కుమార్‌..
లక్ష్మి పార్వతి గా యజ్ఞశెట్టి
చంద్రబాబు గా శ్రీ తేజ్

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ స్లో నేరేషన్

ఫస్ట్ హాఫ్ బోరింగ్..

వర్మ గురించి చెప్పాలి అంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ చూస్తే చాలు అనిపించే విధంగా తీశాడు. వర్మలోని టాలెంట్ ను తెరపై చూపించడంలో సక్సెస్ అయ్యాడు. రమ్మీ అందించిన ఫోటోగ్రఫి చాలా కొత్తగా ఉంది. కళ్యాణి మాలిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు డబుల్ ప్లస్ అయింది.

రేటింగ్ : 3.75 /5

స్టార్ హీరో కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్..!!

Leave A Reply

Your email address will not be published.