Skyscraper left
Skyscraper Right

మజిలీ మూవీ రివ్యూ…

నటీనటులు : అక్కినేని నాగ చైతన్య, సమంత, దివ్యాన్ష కౌశిక్, రావు రమేష్ , పోసాని కృష్ణమురళి…
దర్శకత్వం : శివ నిర్వాణ
నిర్మాత : హరీష్ పెద్ది, సాహు గారపాటి
సినిమాటోగ్రఫీ : విష్ణు శర్మ
మ్యూజిక్ : గోపి సుందర్ , ఎస్.ఎస్.తమన్
విడుదల తేదీ : 05 , ఏప్రిల్ 2019

నాగ చైతన్య-సమంత జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకుడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో ఇదో ఎమోషనల్ ‘మజిలీ’ అని అర్థమైంది. భారీ అంచనాల మధ్య మజిలీ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా రిలీజ్ కు ముందే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. రిలీజ్ తరువాత కూడా ఇదే టాక్ ను సొంతం చేసుకున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలుస్తోంది. మరీ ఈ సినిమా ఏస్థాయిలో ప్రేక్షకులను మెప్పించిందో ఈ సమీక్ష ద్వారా చూద్దాం.

కథ విషయానికొస్తే,

టీనేజ్ లో పూర్ణ (నాగ చైతన్య) ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు.. ఆ అమ్మయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.. కానీ వారి ప్రేమకు పెద్దలు అడ్డుగా మారడంతో వారి ప్రేమ పెళ్లి దాక వెళ్ళదు.దాంతో పూర్ణ బాగా డిస్టర్బ్ అయిపోతాడు.. తాగుడు కి అలవాటైపోయి అలా డిప్రెషన్ కి వెళ్ళిపోతాడు.. దాంతో పూర్ణ కి పెళ్లి చేస్తే మారతాడు అని శ్రావణి (సమంత) కి ఇచ్చి పెళ్ళిచేస్తారు.. కానీ పూర్ణ పెళ్లి తర్వాత కూడా అలానే ఉంటూ అందరిని ఇబ్బంది పెడతాడు.. కానీ భార్య శ్రావణి మాత్రం భర్త కి సపోర్ట్ చేస్తుంది.. చివరికి భార్య ప్రేమను పూర్ణ ఎలా అర్థం చేసుకుంటాడు.. వారిద్దరూ ఎలా ఒక్కటై జీవితాంతం ఎలా సంతోషంగా ఉంటారు అనేదే ఈ సీనిమా కథ..

నటీనటులు :

నాగచైతన్య మరియు సమంత లు పోటి పడీ మరీ నటించారు, సెకెండ్ ఆఫ్ లో వీరి కలయికలో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి, సెకెండ్ హీరోయిన్ కూడా బాగానే నటించింది, కానీ ఎక్కువ మార్కులు మాత్రం సమంత కొట్టేయగా, కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో నాగ చైతన్య ఆకట్టుకుంటాడు. ఏం మాయ చేశావె సినిమా వచ్చి దాదాపు పదేళ్లు అవుతున్నా.. వీరి మధ్య ప్రేమతగ్గలేదు. మళ్లీ అదే మేజిక్ రిపీట్ అయింది. మిగిలిన నటీనటులు ఉన్నంతలో మెప్పించారు..

సాంకేతికవిభాగం :

దర్శకుడు శివ నిర్వాణ బలమైన కథ రాసుకొన్నాడు. కథ-కథనం అద్భుతంగా కుదిరాయి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ దర్శకుడు నడిపిన విధానం అద్భుతంగా ఉంది. ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ, రొమాన్స్ తో నింపేశాడని, సెకండ్ హాఫ్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది.. శివ కథ పాయింట్ సింపుల్ దే ఎంచుకున్నా లీడ్ పెయిర్ నుండి అద్బుత నటన ని రాబట్టి సినిమా ని ఫీల్ గుడ్ మూవీ గా తీర్చిదిద్దాడు. గోపి సుందర్ పాటలు బాగున్నాయి.. థమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకే హైలైట్. ఒక్క మాటలో చెప్పాలంటే.. మణిరత్నం సినిమాలో తరహా నేపథ్య సంగీతాన్ని అందించాడు. నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి.. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పనులు చాల బాగున్నాయి..

ప్లస్ పాయింట్స్ :

నాగ చైతన్య, సమంత పెర్ఫార్మన్స్..

శివ డైరెక్షన్..

తమన్ నేపథ్య సంగీతం…

మైనస్ పాయింట్స్ :

మూవీ లెంగ్త్ ఎక్కువ అయ్యింది..

కమర్షియల్ ఎలిమెంట్ తక్కువ…

కాస్త ల్యాగ్…

ఓవరాల్ గా చూసుకుంటే మజిలీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునే ఎమోషనల్ లవ్ స్టొరీ. యూత్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫ్యాన్స్ కి నచ్చే అంశాలు సినిమాలో చాలా ఉన్నాయి, కానీ అక్కడక్కడా కొద్దిగా స్లో అవ్వడం, ట్రాక్ కొంచం తప్పినట్లు అనిపించడం మేజర్ కంప్లైంట్స్.

టాగ్ లైన్ : పెళ్లి తర్వాత ప్రేమ.. నిన్ను కోరి పార్ట్ 2 లా ఉంది..

రేటింగ్ : 3.25 /5

Samantha Ruth Latest Stills

Leave A Reply

Your email address will not be published.