Skyscraper left
Skyscraper Right

ఎన్టీఆర్ – మహానాయకుడు రివ్యూ..

సినిమా : ఎన్టీఆర్ – మహానాయకుడు
బ్యానర్ : ఎన్.బి.కె ఫిలిమ్స్, వారాహి ప్రొడక్షన్స్..
నటీనటులు : నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, దగ్గుబాటి రానా, కళ్యాణ్ రామ్,సుమంత్, భరత్ రెడ్డి, దగ్గుబాటి రాజా తదితరులు..
మ్యూజిక్ డైరెక్టర్ : ఎమ్.ఎమ్. కీరవాణి
దర్శకుడు : జాగర్లమూడి క్రిష్
నిర్మాత : నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి
విడుదల తేదీ : 22 ఫిబ్రవరి 2019

నందమూరి బాలకృష్ణ హీరో గా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర గా ఎన్టీఆర్ కథానాయకుడు , మహానాయకుడు సినిమా లు తెరకెక్కిన సంగతి తెలిసిందే.. కథానాయకుడు సంక్రాంతి కానుకగా రిలీజ్ కాగా, మహానాయకుడు నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రిలీజ్ అయ్యింది.. విద్యాబాలన్, దగ్గుబాటి రానా, కళ్యాణ్ రామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా కి జాగర్ల మూడి క్రిష్ దర్శకత్వం వహించారు.. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎరకు మెప్పించిందో ఈ సమీక్ష చూసి తెలుసుకుందాం..

కథ విషయానికొస్తే,

ఈ సినిమా మొదటి పార్ట్ లో ఎన్టీఆర్ సినీ రంగప్రవేశం, స్టార్ అయన ఎదిగిన క్రమం చూపించగా రెండో పార్ట్ లో అవన్నీ టైటిల్ రన్ టైం లో చూపించి మొదటి భాగం లో ఎక్కడైతే సినిమా ఎండ్ అయ్యిందో అక్కడినుంచి మొదలవుతుంది.. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన తర్వాత ఎన్టీఆర్ జీవితంలో జరిగిన రాజకీయ మలుపులు , చంద్రబాబు ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించాక జరిగిన అనూహ్యమార్పులు, పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం చేజిక్కించుకోవడం, వెంతంటే ప్రజాకర్ష పథకాలతో విప్లవాత్మక మార్పులు జరగడం వంటివి ఈ కథలో చూస్తాం..

నటీనటులు,

బాలకృష్ణ ఏంటి ఎన్టీఆర్ గా నటించడమేంటి.. అసలు ఎన్టీఆర్ గా బాలకృష్ణ అస్సలు యాప్ట్ కాలేదన్న వ్యాఖ్యలు మొదటి పార్ట్ కథానాయకుడు సమయంలో వినిపించినా మహానాయకుడు సినిమా చుసిన తర్వాత ప్రతిఒక్కరు ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటారు.. వయసుకు తగ్గ పాత్ర లో బాలకృష్ణ బాగా ఆకట్టుకున్నాడు.. మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు బాలయ్య ఎన్టీఆర్ గా బాగా అలరించాడు.. అచ్చం ఎన్టీఆర్ లా నటించలేకపోయినా నటన తో ఆకట్టుకున్నాడు.. తండ్రి పాత్రలో వేరియేషన్స్ ని చాల బాగా వ్యక్తపరిచారు.. అసెంబ్లీ సీన్స్ లో మంచి ఎమోషన్స్ ని పండించారు.. ఇక నాదెండ్ల భాస్కర్ రావు పాత్రలో చేసిన సచిన్ కేడ్ఖర్ మంచి హావభావాలను పలికించారు.. ఈ సినిమాలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది రానా చేసిన చంద్రబాబు పాత్ర గురించి.. ఈ సినిమా లో చంద్రబాబు పాత్ర ని ఎంతో పర్ఫెక్ట్ గా చూపించారు.. ఈ సినిమా లో చంద్రబాబు ను హీరో గా చూపించే ప్రయత్నం చేశారు.. ఫైట్స్ తో ఒకరకంగా నవ్వుకోవాల్సి వస్తున్నా సీన్ కి అది అవసరమే.. ఇక ఆ పాత్రలో రానా అచ్చుగుద్దేశాడు.. అయన మ్యానరిజం, వాయిస్ ని ఇమిటేట్ చేయడానికి చాల కష్టపడ్డాడు.. ఇక మిగితా ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. వారు కథానాయకుడులో చేసిన మాదిరిగానే అద్భుతంగా నటించారు..

సాంకేతిక నిపుణులు ,

ఈ సినిమా ఇంత బాగా రావడానికి దర్శకుడు క్రిష్ ప్రధాన కారణం.. సినిమా లో కథ కథనాలకు ఎక్కవుగా ప్రాధాన్యం ఉండడంతో వేరే ఏ హంగామా కి పోకుండా సినిమా ని రూపొందించి ఆసక్తి రేకెత్తించే విధంగా కథను నడిపించాడు..సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ కూడా చాల బాగున్నాయి.. కొన్ని కొన్ని డైలాగ్స్ కి క్లాప్స్ పడ్డాయి.. మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్.ఎమ్.కీరవాణి నేపథ్య సంగీతంలో వేలుపెట్టలేని విధంగా ఆకట్టుకుంది.. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ చాల బాగుంది.. చాల షాట్స్ నమ్మదగినవిగా ఉన్నాయి.. ఎన్.బి.కె ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి..

ప్లస్ పాయింట్స్ :

బాలకృష్ణ నటన,
డైరెక్షన్

మైనస్ పాయింట్స్ :
క్లైమాక్స్
ఉన్నది ఉన్నట్లు లేకపోవడం

ఫైనల్ గా.. కథానాయకుడు లో సినిమా జీవితం, మహానాయకుడులో రాజకీయ జీవితం గురించి చూపించినా ఎక్కడో అసంతృప్తి మిగిలిపోయినట్లు అనిపిస్తుంది.. నాదెండ్లను ఎదురించి తిరిగి తిరిగి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడంతోనే సినిమా ముగుస్తుంది.. ఎన్టీఆర్ అసలు జీవితం ఇక్కడినుంచే మొదలవుతుంది.. ఆ తర్వాత ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించడం, ఎన్టీఆర్ మానసిక స్థితి, చంద్రబాబు వెన్నుపోటు ఏదీ ఇందులో చూపించలేదు.. ఒకవేళ ఫ్యూచర్ లో చంద్రబాబు, బాలకృష్ణ ఏదైనా చెందితే మూడో పార్ట్ ఆశించవచ్చేమో..

టాగ్ లైన్ : క్లైమాక్స్ లేని సినిమా.. పెరుగులేని భోజనం..

రేటింగ్ : 2.75/5

Leave A Reply

Your email address will not be published.