Skyscraper left
Skyscraper Right

‘సూర్యకాంతం’ మూవీ రివ్యూ ..!!

నటీనటులు : నిహారిక, రాహుల్ విజయ్, సుహాసిని,సమీర్,శివాజీ రాజా,
నిర్మాత : సందీప్ ఎర్రం రెడ్డి, సృజన్ యారబోలు, రామ్ నరేష్
దర్శకత్వం : ప్రణీత్ బ్రహ్మాండపల్లి
సినిమాటోగ్రాఫర్: హరిజ్ ప్రసాద్
సంగీతం : మార్క్ కె రాబిన్
ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్ల
సాహిత్యం : కృష్ణ కాంత్
ఎడిటర్ : రవితేజ గిరిజాల

మెగా హీరోయిన్ నిహారికలో అందం, నటన రెండు ఉన్నా అదృష్టం కలసి రావడం లేదు.. తెలుగులో, తమిళంలో నటించిన మూవీలు హిట్ కాకపోయిన ఆమెకు మంచి మార్క్ లు పడ్డాయి.. అయితే కెరీర్ కు బ్రేక్ ఇచ్చే మూవీ అని భావించి సూర్యకాంతంలో నటించింది..షార్ట్ ఫిల్మ్ లో నిహారికిను ప్రమోట్ చేసిన ప్రణీత్ బ్రమండపల్లి తొలిసారిగా ఈ మూవీ ద్వారా దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అవతున్నాడు.. అటు నిహారిక, ఇటు ప్రణీత్ లు ఈ మూవీ హిట్ ఇచ్చిందా లేదా తెలుసుకోవాలంటే ఈ సమీక్ష చదవాల్సిందే..

కథ

హీరోయిన్ సూర్యకాంతం (నిహారిక) తల్లితండ్రులు చిన్నపుడే విడిపోతారు. దీంతో సూర్యకాంతం తల్లి దగ్గరే పెరుగుతోంది. అంతేకాదు తల్లి పెంపకంలో సూర్యకాంతం చాలా క్రేజీ అమ్మాయిగా మారుతుంది. తనకు ఏది తోస్తే అది చేయడం హాబి. సూర్యకాంతం క్యారెక్టర్ చేసి హీరో (రాహుల్ విజయ్) ఆమె ప్రేమలో పడతాడు. అంతేకాదు సూర్యకాంతంకి తన ప్రేమకు ప్రపోజ్ చేస్తాడు కూడా. ఆ తర్వాత సూర్యకాంతం కనిపించకుండా పోతుంది. దీంతో రాహుల్మ విజయ్ మరో అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమెతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటాడు. తీరా పెళ్లి సమయానికి సూర్యకాంతం మళ్లీ హీరో జీవితంలో ప్రవేశిస్తుంది. ఆ తర్వాత రాహుల్ విజయ్ జీవితం ఏమి చేస్తాడు ? అతడు సూర్యకాంతంను పెళ్లి చేసుకున్నాడా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ.

నటీనటులు :

తొలి చిత్రంతో హీరోగా నిరూపించుకున్న రాహుల్ విజయ్.. అభి పాత్రలో ఒదిగిపోయాడు. లవ్ ఎమోషన్స్ సీన్స్‌లో హావభావాలను పలికించగలిగాడు. నిహారిక టైటిల్ పాత్ర‌ధారిగా ఆమె గ‌త చిత్రాల కంటే బాగానే చేసింది కానీ.. గొప్ప‌గా అయితే చేసిందేమీ లేదు. ప్రెజెంట్ జనరేషన్‌లో అమ్మాయిలు ఎలా ఉంటారో ఆ క్యారెక్టర్‌లో చక్కగా ఒదిగిపోయింది. పెర్‌లెని, శివాజీ రాజా, స‌త్య త‌దిత‌ర పాత్ర‌ధారులంద‌రూ వారి వారి పాత్ర‌ల పరిధి మేర చ‌క్క‌గా న‌టించారు.

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండపల్లి..ఒక వెబ్ సిరీస్ చేయాల్సిన కథతో సినిమాను తీసినట్టు కనబడింది. ఇది మొట్ట మొదటి సినిమాయే అయినా ముగ్గురి మధ్యలో సాగే త్రిముఖ ప్రేమ కథను చక్కగా హ్యాండిల్ చేశాడు..అలాగే తాను రాసుకున్న పాత్రలను అనుకున్నది అనుకున్నట్టు చూపించడంలో కూడా సక్సెస్ అయ్యాడు.రొటీన్ కథను డిఫరెంట్‌గా ప్రజెంట్ చేయాలనే ఆలోచన బావుంది కాని.. తెరకెక్కించిన విధానం కన్విన్సింగ్‌గా లేదు. కామెడీ జిమ్మిక్కులతో కథను నడిపిస్తూ తాను కన్ఫ్యూజ్ అవుతూనే ప్రేక్షకుల్నీ కన్ఫ్యూజన్‌లో పడేశారు. ఫస్టాఫ్ మొత్తాన్ని సాఫీగా లాగించిన దర్శకుడు సెకండాఫ్‌లో స్లోనరేషన్‌తో విసుగుతెప్పించారు.ఫోటోగ్రఫీ కూడా ఏమంత బాగాలేదు. మ్యూజిక్ మాత్రం సోసో గా ఉంది.నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

నిహారిక నటన

కొన్ని సన్నివేశాలు

మైనస్ పాయింట్స్ :

కథ,కథనం

వెబ్ సిరీస్‌ల ఉండటం

సినిమా మొత్తం సాగతీత

ఫోటోగ్రఫీ

డైరెక్షన్ వీక్

కథానుసారం వచ్చే హాస్య సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. అయితే ఈ మూవీలో ఎక్కడ కొత్తదనం కనిపించదు.. రోటిన్ గా సాగిపోయే సినిమా.. ద‌ర్శ‌కుడు ప్ర‌ణీత్ సినిమాను ఇంకాస్త బాగా చేసుండొచ్చు అనిపించింది.మల్టీఫ్లెక్స్ ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది.

రేటింగ్ : 2.5/5

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ…!!

Leave A Reply

Your email address will not be published.