Skyscraper left
Skyscraper Right

ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కి కేంద్ర ఎన్నికల సంఘం పిలుపు.. ఢిల్లీకి పయనం..!!

ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నుంచి పిలుపు రావడంతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆయన సీఈసీని గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు కలవనున్నారు. అధికార పార్టీ టీడీపీకి ఠాకూర్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈసీ ఆయన్ను ఢిల్లీకి పిలిపించింది. ఇటీవల ఏపీలో చోటుచేసుకున్న పోలీసుల బదిలీలు, ఏపీ ఇంటెలిఎన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ జీవో వివాదం వ్యవహారం, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య తదనంతర పరిణామాలపై డీజీపీని ఈసీ వివరణ కోరే అవకాశమున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అయితే, సాక్షాత్తూ డీజీపీని ఈసీ ఢిల్లీకి పిలిపించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

రూ.100 కోట్లు ఏపీ ప్రభుత్వానికి జరిమానా..!!

Leave A Reply

Your email address will not be published.