Skyscraper left
Skyscraper Right

కాంగ్రెస్, బీజేపీ ల వలన దేశానికి ఒరిగిందేమీ లేదు – కేసీఆర్..!!

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినట్లే పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పునివ్వాలని ప్రజలను కోరారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని 17 స్థానాల్లో విజయం సాధిస్తే .. కేంద్రంలో చక్కం తిప్పొచ్చని పేర్కొన్నారు. నిధులు రాబట్టుకోవచ్చని, ప్రాజెక్టులకు జాతీయ హోదా .. వివిధ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. మంగళవారం సాయంత్రం నిజామాబాద్‌లో ఆశేష జనవాహిని మధ్య ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. సమైక్యపాలకుల పుణ్యమని నిజాంసాగర్ ఎండిపోయేదన్నారు. 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సమయంలో నిజామాబాద్ జిల్లా పరిషత్ పీఠంపై గులాబీ జెండా ఎగిరిందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం గౌరవాన్ని నిలబెట్టిన జిల్లా నిజామాబాద్ జిల్లా అంటూ చెప్పుకొచ్చారు.

రేపే టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా..!!

15 ఏళ్ల పోరాటం తర్వాత రాష్ట్రం సిద్ధించిందని కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకున్నా మరికొన్ని సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు తెలిపారు. పెన్షన్లు, రైతులకు పెట్టుబడి సాయం పెంచినట్లు తెలిపారు. అయోధ్య రామ జన్మభూమి వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కరీంనగర్ మీటింగ్‌ లో నేను మాట్లాడిన తర్వాత బీజేపీ వాళ్లు నాపై విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో గ్రూపులు పెట్టి తిడుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నన్ను ఓ ప్రశ్న అడిగారు. రామ జన్మభూమిపై నా స్టాండ్ ఏంటో చెప్పాలట. అసలు రాజకీయ పార్టీలు ఉన్నది వీటి కోసమేనా. అసలు మీది మత ప్రచారం చేసే పార్టీయా? ప్రజా సమస్యలు తీర్చే పార్టా.. లక్ష్మణ్ సమాధానం చెప్పాలి’ అని కేసీఆర్ అన్నారు.

అన్న చిరు బాటలోనే పవన్.. రెండు చోట్లపోటీకి సిద్ధం..!!

Leave A Reply

Your email address will not be published.