Skyscraper left
Skyscraper Right

బీజేపీ లోకి డీకే అరుణ..!!

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నేతల పార్టీల ఫిరాయింపులు మరింత ఊపందుకున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు అధికార టీఆర్ఎస్‌ పార్టీలోకి క్యూకట్టారు. ఈ క్రమంలో మరో కాంగ్రెస్ సీనియర్ నేత హస్తం పార్టీకి బిగ్ షాకిచ్చినట్లు సమాచారం. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. బీజేపీలో చేరడం కోసం ఆమె ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. రెండు రోజుల కిందటే బీజేపీ పెద్దలతో డీకే అరుణ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఆమె మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలనీ అనుకుంటున్నట్టు సమాచారం. బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ డీకే అరుణతో మంగళవారం ఉదయం చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్, బీజేపీ ల వలన దేశానికి ఒరిగిందేమీ లేదు – కేసీఆర్..!!

Leave A Reply

Your email address will not be published.