Skyscraper left
Skyscraper Right

అక్కడ ఆసక్తికర రాజకీయం.. వైసీపీ ని ఓడించేదిశగా జనసేన..!!

– రాయలసీమలోని ఒక నియోజకవర్గంలో వైసీపీ – జనసేనలు హోరాహోరిగా తలపడపోతున్నాయా…
– ఈ నియోజకవర్గంలో టీడీపీ మూడవ స్థానానికే పరిమితం కాబోతుందా…

– వైసీపీకి కంచుకోటగా భావించే ఈ నియోజగకవర్గం పై జనసేన ప్రత్యేక ద్రుష్టి సారించిందా…

– ఇంతకీ ఈ నియోజకవర్గం ఎదంటారా…హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకొని…సిట్టింగ్ ఎమ్మెల్యేగా మరోసారి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కొరముట్ల శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వే కోడూరు నియోజకవర్గం…

– రాజంపేట ఎంపీ పరిధిలో ఉన్న రైల్వే కోడూరు నియోజకవర్గంపై…రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి ఎలాంటి అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు…రైల్వే కోడూరుపై జనహితం స్పెషల్ స్టోరీ…

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల జోరు ఊపందుకుంది.. ఎన్నికలకు ఇంకా 20 రోజుల సమయమే ఉండడంతో అన్ని పార్టీ ల అభ్యర్థులు , నాయకులు, నేతలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో నాయకులూ తమ బహిరంగ సభలతో ప్రజల్లో చైతన్యం నింపుతూ అధికారంలోకి రావాలని ఎవరికీ వారు హామీలు కురిపిస్తున్నారు.. ఇక రాయలసీమ లోని రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఈ సారి హోరాహోరీ పోటీ తప్పదన్నట్లుగా పరిస్థితి నెలకొంది..ఇక్కడ పోటీ ప్రతిపక్షం వైసీపీ – అధికార పక్షం టీడీపీ మధ్య అనుకుంటున్నారా? కాదు…వైసీపీ – జనసేనల మధ్య…

వైసీపీ :

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన రైల్వే కోడూరు నియోజకవర్గంలో వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.. కొరముట్ల శ్రీనివాసులు 2009 లోనూ వైసీపీ తరపున ఘన విజయం సాధించారు.. ఆ తర్వాత 2012 లో జరిగిన ఉప ఎన్నికలలో మరియు 2014 ఎన్నికలలో పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించారు.. అయితే 2014 లో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీకి సపోర్ట్ చేయడంతో మెజారిటీ కాపు సామాజికవర్గం మొత్తం టీడీపీ వైపు నిలబడడంతో కేవలం 1900 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలిచారు కొరముట్ల..

2019 విషయానికి వస్తే ఇప్పుడున్న వాస్తవిక పరిస్థితుల ప్రకారం ఎవరైనా వరుసగా మూడు సార్లు గెలిస్తే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది..కానీ కొరముట్ల గెలిచినా మూడు సార్లు ప్రతిపక్షంలో ఉండడం. ప్రభుతంలో ఉన్న టీడీపీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించకపోవడంతో కొరుముట్లపైన ప్రజల్లో సానుభూతి ఉంది…అంతేకాకుండా వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుండి కొరముట్ల జగన్ మనిషిగా ఉండడంతో వైసీపీ ఓటు బ్యాంకు అలాగే ఉంది…రైల్వే కోడూరులో పెనగలూరు, పుల్లంపేట, ఓబులవారిపల్లె మండలాల్లో వైసీపీకి మంచి పట్టు ఉంది…ప్రతి ఎన్నికలలో ఈ మూడు మండలాల్లో మెజారిటీ రావడంతో వైసీపీ విజయం శాడిస్టు వస్తుంది…

జనసేన :

కానీ ఈ నియోజకవర్గంలో గెలుపోటములు నిర్ణయించే సత్తా కాపు సామాజికవర్గంపైనే ఆధారపడి ఉంటుంది…ఈ నియోజకవర్గంలో సుమారు 40,000 పైచిలుకు ఓట్లు కాపు సామాజికవర్గానికి ఉన్నాయి… రైల్వే కోడూరుతో పాటు పుల్లంపేట, ఓబులవారిపల్లె మండలల్లో ఎక్కువ గా కాపు వర్గం వారే ఉండడం జనసేన కు కలిసివచ్చే అంశం…ఈ ఎన్నికలలో ఎలాగైనా జనసేన జెండా ఎగురవేయాలని కాపు సామాజికవర్గం మొత్తం ఏకతాటిపైకి వచ్చి తమ ఐకమత్యం, బలం ఏంటో నిరూపించుకోవాలని చూస్తున్నారు…

జనసేన తరపున పోటీచేస్తున్న వెంకట సుబ్బయ్య .. అక్కడ సామజిక, సేవ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు దింతో కాపు సామజిక వర్గం మొత్తం జనసేన వెంట నడుస్తుంది. ఈ నేపథ్యంలో జనసేన రాకతో ఈ ఎన్నికల్లో కొరుముట్లకి వెంకట సుబ్బయ్య రూపంలో తీవ్రమైన పోటీ తప్పదని తెలుస్తుంది..ఈ పరిణామాలతో రైల్వే కోడూరులో వైసీపీ – జనసేన మధ్య ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు…

టీడీపీ :

2004 వరకు ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట..రాజశేఖర్ రెడ్డి హవాతో కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా మారింది..2014 ఎన్నికలలో టీడీపీ కేవలం 1900 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయింది…టీడీపీకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడంతో గెలుపోటములను నిర్దేశించే కాపు సామాజికవర్గంలోని మెజారిటీ శాతం టీడీపీకే జైకొట్టారు దింతో టీడీపీ – వైసీపీ మధ్య గట్టిపోటీ నెలకొంది…

ఇప్పుడున్న వాస్తవిక పరిస్థితులను ఒకసారి చూసుకుంటే జనసేన ఈ నియోగకవర్గంలో పోటీ చేస్తుండడంతో కాపు సామజిక వర్గం మొత్తం జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. టీడీపీ తరపున నిలుచున్న అభ్యర్థి నరసింహ ప్రసాద్ పైన గతంలో పలు చెక్ బౌన్స్ కేసులు, భూకబ్జా కేసులు ఉండడంతో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది అనే చెప్పాలి…దింతో ఇక్కడ టీడీపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంటుందని విశ్లేషకుల అంచనా…

అంచనాలు :

ఈ ఎన్నికల్లో రైల్వే కోడూరు నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించనున్నారు రాజంపేట మాజీ ఎంపీ మిథున్ రెడ్డి.. ఈ నియోజకవర్గం మిథున్ రెడ్డి పోటీ చేస్తున్న రాజంపేట పార్లమెంట్ పరిధిలోకి రావడంతో మరోసారి వైసీపీ జెండాను ఈ నియోజకవర్గంలో ఎగురవేయాలని అయన అక్కడ ప్రత్యేక దృష్టి సారించారు.

గడప గడపకు తిరుగుతూ వైసీపీ అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు గెలుపు కోసం మిథున్ రెడ్డి కృషి చేస్తున్నారు. రాజకీయ అనుభవం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన మిథున్ రెడ్డి ఎత్తుకు పైఎత్తులు వేయడంలో దిట్ట.. తన వ్యూహాలతో కొరముట్లని గెలిపించుకుని రైల్వే కోడూరుపై తమ పట్టు పోనీవకుండా చేసి ప్రజలకు మరోసారి తమ నిస్వార్థమైన సేవ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.. దానికి తోడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా వైసీపీ కి తోడవడంతో అన్ని పార్టీలకు చెక్ పెట్టి వైసీపీ ని గెలిపించే దిశగా ఆయన అడుగులు వేస్తూ ముందుకు సాగుతూ వైసీపీ వర్గాల్లో పాజిటివ్ ఎనర్జీ ని నింపుతున్నారు.

ఇక్కడ అధికార పార్టీ టీడీపీకి కాపులు దూరం అవ్వడంతో టీడీపీ చాల బలహీనంగా ఉంది.. దింతో ఇక్కడ పోటీ వైసీపీ – జనసేనల మధ్య ఉంది…. మరి రైల్వే కోడూరు ప్రజలు ఎవరిని గద్దెనెక్కిస్తారో చూడాలి..

Leave A Reply

Your email address will not be published.