Skyscraper left
Skyscraper Right

మిథున్ రెడ్డి పక్క ప్లాన్..ఆందోళనలో టీడీపీ..!!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మాములుగా లేదు.. అన్ని పార్టీ లు పోటాపోటీగా ప్రచారాలు సాగిస్తూ ప్రజల్లో తమ పలుకుబడిని , పాపులారిటీ ని గెలుచుకుంటున్నాయి.. ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ మునుపెన్నడూ లేని ఉత్కంఠ ను ఈ ఎన్నికల్లో నెలకొల్పుతున్నారు.. ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులే సమయం ఉండడంతో ఈసారి ఎవరు పీఠం ఎక్కుతారా అని నాయకులతో పాటు ప్రజలలోనూ ఆసక్తి రోజురోజుకు ఎక్కువవుతుంది.. ఇకపోతే రాజంపేట పార్లమెంటరీ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు పక్కాగా కనిపిస్తుంది.. రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి పి.వి మిథున్ రెడ్డి అందుకు తగ్గ వ్యూహాలు రచిస్తున్నారు..
రాజంపేట పార్లమెంటరీ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలుండగా గత ఎన్నికల్లో 5 స్థానాలను గెలుచుకుంది వైసీపీ పార్టీ.. రాజంపేట, తంబళ్లపల్లె మినహా మిగితా స్థానాలైన కోడూరు, రాయచోటి, పీలేరు, మదనపల్లె, పుంగనూరు స్థానాలలో వైసీపీ అధికారపార్టీ టీడీపీ పైనే బంపర్ మెజారిటీ తో గెలిచింది.. కాగా ఈసారి మిగిలిన రెండు స్థానాలలో గెలిచి మొత్తం రాజంపేట పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవాలి అని వైసీపీ వ్యూహాలు రచిస్తుండగా మిథున్ రెడ్డి దర్శకత్వంలో ఆ వ్యూహాలు పక్కాగా అమలవుతున్నాయి..
సేవా కార్యక్రమాలతో అక్కడి ప్రజల్లో మంచి పేరున్న మిథున్ రెడ్డి రాజకీయ చతురత కలిగిన వ్యక్తి.. ప్రత్యర్థి ఎత్తుకు పైఎత్తు వేయగల సమర్ధుడు.. విలు విద్య‌ను అభ్య‌సించే స‌మ‌యంలో అర్జ‌నుడికి చెట్టుపై పిట్ట త‌ప్ప మరేదీ క‌నిపించ‌ని విధంగా.. ప్ర‌జారాజ‌కీయాల్లో ఉన్న మిథున్ రెడ్డి కి  ఒక్క ప్ర‌జ‌ల బాగోగులు, వారి అభివృద్ధి త‌ప్ప మ‌రొక‌టి ల‌క్ష్యంగా లేవ‌న్న‌ట్టుగా ఆయ‌న ముందుకు సాగారు..  ప్రజల సంక్షేమం కోసం ఎంత దూరమైనా వెళ్లే మిథున్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో ముఖ్యంగా రాజంపేట పార్లమెంటరీ లోని 7 అసెంబ్లీ స్థానాలపై దృష్టి సారించి అక్కడ వైసీపీ విజయకేతనం ఎగరవేసేలా పక్కా ప్లాన్ సిద్ధం చేశారట.. కొద్దిపాటిలో మిస్ అయిన రాజంపేట, తంబాలపల్లి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడి అభ్యర్థుల ప్రచారాలని దగ్గరుంచి చూసుకుని వారి ని గెలుపు గుర్రాలుగా మార్చాలని ప్రణాళికలు రచిస్తున్నారు.. ఇతర పార్టీలకు దిమ్మతిరిగేలా మిథున్ రెడ్డి వ్యూహాలు, ప్రణాళికలు చూస్తుంటే ఆ 7 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా రెపరెపలాడడం ఖాయం అనిపిస్తుంది…

Leave A Reply

Your email address will not be published.