Skyscraper left
Skyscraper Right

టీడీపీ కి చెక్ పెట్టేందుకు మిథున్ రెడ్డి ని ఆయుధంగా మలుచుకున్న జగన్.. ప్రజాసేవే మిథున్ లోని ప్లస్ పాయింట్..!!

ఆంధ్రప్రదేశ్‌లోని 25 పార్లమెంటు స్థానాల్లో రాజంపేట ఒకటి. వాస్తవానికి రాజంపేట కడప జిల్లాలో ఉంది.ఇటు కడప జిల్లాలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు అటు చిత్తూరు జిల్లాలో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నాయి. అవి రాజంపేట, కోడూరు, రాయచోటి సెగ్మెంట్లు కడప జిల్లాలో ఉండగా… తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ఇక ఈ పార్లమెంట్ స్థానానికి వైస్సార్సీపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీ చేస్తున్నారు..

అయితే రాజంపేట పార్లమెంట్ లో అత్యధికంగా ప్రజలు వైసీపీ అభ్యర్థి అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైపే ఉన్నట్లు తెలుస్తుంది.. రాష్ట్రంలోనే వైఎస్సార్సిపి కి అత్యంత కీలకమైన పార్లమెంట్ స్థానం ఏదైనా ఉంది అని అంటే అది రాజంపేట పార్లమెంట్ స్థానమే అన్న సంగతి అందరికీ తెలిసిందే.. గత ఎన్నికల్లో లక్ష 74 వేల పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు మిథున్ రెడ్డి…

ఇంతకీ ఈ మిథున్ రెడ్డి ఎవరు.. జగన్ చేత శభాష్ అనిపించుకున్న ఈయన గత చరిత్ర ఏంటి.. మిథున్ రెడ్డిపై స్పెష‌ల్ స్టోరీ.

కుటుంబ నేపథ్యం :

అయన యువ కేరటం, జగన్ వెన్నంటి నడుస్తూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీల‌క నాయ‌కుడుగా ఎదుగుతున్న యువనేత, వ్యాపార రంగం నుంచి తండ్రి ప్రోత్సాహంతో, ప్ర‌జా మ‌ద్ద‌తుతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చి మొద‌టిసారి ఎంపీగా బాధ్యతలు చెప్పటినప్పటికీ, ప్రజల మన్ననలు పొందుతున్న, పొంగిపోని యువ నేత రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మిథున్ రెడ్డి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి..

చిత్తూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే పెద్దిరెడ్డి కుటుంబం రాజ‌కీయంగా ద‌శాబ్దాల చ‌రిత్ర క‌లిగిన ఫ్యామిలీ. బాగా చ‌దువుకున్న ఫ్యామిలీ కూడా …యూనివ‌ర్సిటి నుంచే రాజ‌కీయాల్లో త‌మ‌కంటూ ఫేమ్ తెచ్చుకున్న నాయ‌కుడు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వారసుడు ఈ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి…. పెద్ది రెడ్డి కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉండడం చేత మిథున్ రెడ్డికి కూడా రాజకీయాలపై ఆసక్తి ఉండేది, ఆ ఆసక్తితోనే తండ్రితో కలిసి పలు సమావేశాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు.

రాజకీయాల్లోనే కాదు, ప్రజాసేవలో కూడా ముందుండే కుటుంబం పెద్ది రెడ్డి కుటుంబం.. అందుకేనేమో మిథున్ రెడ్డి గారికి స్వతహాగా ప్రజాసేవ చేసే గుణం వచ్చింది..

అభివృద్ధి కార్యక్రమాలు :

అయన ఎంపీ అయ్యాక రాజంపేట పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది.. సుమారు ఆరువంద‌ల గ్రామాల్లో నీటి సౌక‌ర్యం కల్పించడంతో పాటు ప‌లు చోట్ల బోర్లు వేయించారు. పాడై పోయిన బోర్ల‌కు మ‌ర‌మ్మ‌తులు చేయించ‌డం, అవ‌స‌రమైన మేర పైపు లైనులు వేయించారు మిథున్ రెడ్డి. సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ నుంచి వచ్చే ప్రతి రూపాయి వాట‌ర్ స్టోరేజ్ కోసం మరియు ఇరిగేష‌న్ కు సంబందించిన హార్టీ క‌ల్చ‌ర్ కోసం కేటాయిస్తున్నారు. రాష్ట్రంలో ర‌హ‌దారులు నేష‌న‌ల్ హైవేస్ అభివృద్ది ఈ మూడున్న‌ర సంవ‌త్స‌రాల‌లో బాగా జ‌రిగింది రాజంపేట పార్లమెంటులో మాత్ర‌మే.. ఈ ప్రాంతాల నుంచి విదేశాల‌కు వెళ్లిన వారికి ఎటువంటి స‌మ‌స్య వ‌చ్చినా ఆదుకుంటూ నేను మీకు తోడుగా ఉన్నాను అనే భరోసాను కల్పిస్తున్నారు మిథున్ రెడ్డి. అలాగే ఆయనకు మిథున్ రెడ్డి సైన్యం, వైసీపీ కువైట్ వింగ్ పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నాయి…

నిధుల వినియోగంలో నెంబర్ వన్ :

ఎంపీ నిధుల వినోయోగంలో మిథున్ రెడ్డి నెంబర్ వన్ గా ఉన్నారంటే అయనకు ప్రజాసేవ అంటే ఎంత మక్కువో తెలుస్తుంది.. ఇప్పటికి వరకు రూ..25,46,29,500 నిధులు విడుదల కాగా, ఆ నిధులతో పాటు సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు.. కడప, చిత్తూరు జిల్లాలో కొత్త చెరువుల నిర్మాణం కోసం ఆయన చేసిన ప్రయత్నం ఆ రెండు జిల్లాల ప్రజలు మర్చిపోలేనిది..

సమస్యలపైన పోరాటం :

రైల్వే సమస్యలపైనా, మంగంపేట గనులకు సంబంధించి పలు మిల్లుల సమస్యలపైనా, వైద్య విద్యార్థులకు న్యాయం చేసే విషయంలో అయన శ్రమ ప్రజలు ఎప్పటికి మర్చిపోలేరు.. మంచి వాక్చాతుర్యం కలిగిన మిథున్ రెడ్డి పార్లమెంట్ లో ఎంతో ఉద్వేగభరితంగా ప్రసంగిస్తూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు.. ఎపికి ప్రత్యేక హోదా కోసం తన పదవిని త్యాగం చేస్తూ ఎంపీ పదవిని రాజీనామా చేసి ప్రజాసేవే తనకు ముఖ్యమని మరోసారి చాటి చెప్పారు.. ప్రత్యేకహోదా లక్ష్యంగా ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మిథున్ రెడ్డి ప్రజాసంక్షేమం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదు..

ప్రజల్లో ఎందుకు అంత ఆదరణ :

ప్రతి కుటుంబం మినరల్ వాటర్ తాగి ఆరోగ్యంతో సుఖశాంతులతో ఉండాలని సొంత నిర్వహణ ఖర్చుతో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.. బస్సు షెల్టర్లు, కమ్యూనిటీ భవనాల నిర్మాణం, సిసి రోడ్ల నిర్మాణం, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, వారికీ కావలసిన సామాగ్రి, అందజేశారు.. ప్రతి వర్గాన్నీ ఆపద్భాందవుడు లా ఆదుకున్నారు. ఇక రాష్ట్రంలోనే అత్యధికంగా నూతన జాతీయ రహదారుల నిర్మాణం చేసే విధంగా కేంద్రప్రభుత్వం ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చిన వ్యక్తి మిథున్ రెడ్డి.. రైల్వే అండర్ బ్రిడ్జి లు, లెవెల్ క్రాసింగ్ లు మంజూరు చేయించడంలో మిథున్ రెడ్డి పాత్ర చాల గొప్పది.. మదనపల్లి పట్టణంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం సెంట్రల్ స్కూల్ స్థాపనకు అనుమతులు తీసుకొచ్చి ప్రజలు మెచ్చిన నాయకుడు అనిపించుకున్నారు.. దీర్ఘ కాళికా వ్యాధితో బాధపడుతున్న 114 మందికి ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి వైద్య ఖర్చులకోసం నిధులు మంజూరు చేయించారు.. తన ఇంటి తలుపు తట్టి వైద్య సహాయం కోరిన ప్రతి ఒక్కరికి వైద్యం చేయించి ఆరోగ్యవంతులుగా ఇంటికి పంపారు.. చదువుకున్న నిరుద్యోగ యువతకు వివిధ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించారు.

అందుకే అక్కడి ప్రజలకు మిథున్ రెడ్డి అంటే చాల ఇష్టం.. కష్టం అని వచ్చిన ప్రతి ఒక్కరి కష్టాన్ని తీర్చే ప్రియమైన నేత మిథున్ రెడ్డి..

గెలుపు దిశగా రాజంపేట పార్లమెంట్ లోని అన్ని నియోజకవర్గాలు :

పెద్ది రెడ్డి మిథున్ రెడ్డి పార్టీలో క్రియాశీల‌కంగా ఉంటూ చిత్తూరు జిల్లాలో అన్ని నియోజక‌వర్గాలలోను కడప జిల్లాలోని కొన్ని నియాజకవర్గాల్లో పట్టు పెంచుకుంటూ పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.

జగన్ ఆశయాలన్నింటిని భుజాన వేసుకొని, ఎలాగైనా వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా వాటిని పాటిస్తూ, పార్టీ ఆదేశానుసారం పార్లమెంటులో తన గళాన్ని విప్పుతూ, పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తున్నారు…మొత్తానికి యువ ఎంపీగా, పార్టీలో కీల‌క నాయ‌కుడిగా, జ‌గ‌న్ కు సోద‌రుడిగా రాజకీయాల్లో ప్ర‌జా సేవ‌చేస్తూ ముందుకు పోతున్నారు మిథున్ రెడ్డి.

Leave A Reply

Your email address will not be published.