Skyscraper left
Skyscraper Right

రూ.100 కోట్లు ఏపీ ప్రభుత్వానికి జరిమానా..!!

చంద్రబాబు సర్కార్‌కు ఎన్నికల సమయంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి నివాసం సమీపంలో ఉన్న కృష్ణానది వద్ద ఇసుక అక్రమ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) రూ.100 కోట్లు జరిమానా విధించింది. ఇసుక రోజుకు 2,500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకూ అక్రమంగా ఇసుక తవ్వుతున్నారంటూ కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేదిక ఆధారంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఈ నిర్ణయం తీసుకుంది. వాటర్‌ మ్యాన్‌ రాజేంద్ర సింగ్‌, అనుమోలు గాంధీ అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి గురువారం జరిమానా విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

మిథున్ రెడ్డి పక్క ప్లాన్..ఆందోళనలో టీడీపీ..!!

Leave A Reply

Your email address will not be published.