Skyscraper left
Skyscraper Right

అన్న చిరు బాటలోనే పవన్.. రెండు చోట్లపోటీకి సిద్ధం..!!

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పోటీ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. ఆయన ఎక్కడ్నుంచి పోటీ చేస్తున్నారన్న విషయంపై మెగా అభిమానులు, జనసేన కార్యకర్తల్లో సర్వత్రా ఆసక్తిరేపుతోంది. దీనిపై జనసేనాని ఓ క్లారిటీ ఇచ్చారు. ఆయన రెండు అసెంబ్లీ స్థానాల్లో ఈ సారి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యవర్గం నిర్ణయం తీసుకుందని పవన్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. ఏయే స్థానాల్లో పోటీ చేసే విషయాన్ని గంట తర్వాత వెల్లడిస్తానని పేర్కొన్నారు.

వివేకా హత్య లో ఉన్నవారిని వదిలిపెట్టను – చంద్రబాబు..!!

ఇవాళ మధ్యాహ్నం కల్లా పవన్ పోటీ చేసే రెండు స్థానాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు రెండు చోట్ల నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో తిరుపతి, పాలకొల్లు నుంచి చిరంజీవి పోటీ చేయగా… తిరుపతిలో గెలిచి.. పాలకొల్లులో ఓడిపోయారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా రెండు చోట్ల నుంచి బరిలోకి దిగే యోచనలో ఉన్నారు.

జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్ధుల రెండ‌వ జాబితా..!!

Leave A Reply

Your email address will not be published.