Skyscraper left
Skyscraper Right

రేపే టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా..!!

తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ప్రచార హోరు పెంచారు. సెంటిమెంట్‌గా కరీంనగర్‌లో తొలి ప్రచారం ప్రారంభించిన ఆయన… నిన్న నిజామాబాద్‌లో ప్రచారం చేసి ఇతర పార్టీ ల కంటే ప్రచారం లో ముందున్నారు.. ఇక టీఆర్ఎస్ జాబితా ఎప్పుడు విడుదల చేస్తుందో తెలిసిపోయింది. మార్చి 21వ తేదీ గురువారం రిలీజ్ చేస్తున్నట్లు స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాలో TRS నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఈ విషయాన్ని వెల్లడించారు.

వైసిపి అభ్యర్థుల ప్రకటనపై చంద్రబాబు సెటైర్..!!

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించారని గుర్తు చేసిన కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 16 సీట్లను గెలిపించాలని కోరారు. ఎంపీలను గెలిపించుకోవడం ద్వారా తెలంగాణ రాష్ట్రం బాగు చేసుకొనే పరిస్థితి ఉంటుందన్నారు. దేశానికి ఒక మార్గదర్శనం చేద్దామని.. ఇందుకు ప్రజల ఆశీర్వాదం కావాలన్నారు. 21న ప్రకటించే జాబితాలో నిజామాబాద్ అభ్యర్థిని కూడా ప్రకటిస్తామని.. ఎవరు అభ్యర్థి అయినా గెలిపించాలని ప్రజలను కోరారు కేసీఆర్.

వివేకా హత్య లో ఉన్నవారిని వదిలిపెట్టను – చంద్రబాబు..!!

Leave A Reply

Your email address will not be published.