Skyscraper left
Skyscraper Right

వివేకా హత్య దర్యాప్తు ను స్వతంత్ర సంస్థకు అప్పగించండి.. హై కోర్టు లో జగన్ పిటిషన్..!!

సుమారు 35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన, సౌమ్యుడైన వైఎస్‌ వివేకానందరెడ్డిని ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అతి కిరాతకంగా హత్య చేయడం దారుణమని వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్యకేసులో హైకోర్టును ఆశ్రయించారు ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి. తన బాబాయ్ హత్యను ఓ సాధారణ హత్యగా పరిగణిస్తున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్న జగన్ స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరపాలని కోర్టును కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్‌ పై తనకు నమ్మకం లేదని చెప్పిన జగన్… అసలు వాస్తవాలు బయటకు రావని పిటిషన్‌లో పేర్కొన్నారు. వైయస్ వివేకానంద హత్యను తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు జగన్.

వైసిపి అభ్యర్థుల ప్రకటనపై చంద్రబాబు సెటైర్..!!

Leave A Reply

Your email address will not be published.