Skyscraper left
Skyscraper Right

జగనన్న ను సీఎం గా చూడాలన్నదే నాన్న కోరిక – వివేకా కూతురు సునీత..!!

సిట్‌ దర్యాప్తుపై ప్రభావం చూపేలా వ్యాఖ్యలు సరికాదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ప్రెస్‌మీట్‌లో హితవు పలికారు. నాన్న మరణం మమ్మల్ని ఎంతో కుంగదీసింది. నాన్నపై మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తలు కన్నీరు తెప్పించాయి. మా నాన్నను అతికిరాతకంగా హత్య చేశారని వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, 700 మంది సభ్యులు ఉన్న పెద్ద కుటుంబం తమదని ఆమె తెలిపారు.

వైసిపి అభ్యర్థుల ప్రకటనపై చంద్రబాబు సెటైర్..!!

ఇంత పెద్ద కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు సహజమని, దర్యాప్తు సాగుతుండగా తమ అభిప్రాయాలు ఎలా చెబుతామని సునీత ప్రశ్నించారు. చాలా కాలంగా పులివెందులలో నాన్న ఒక్కరే ఉంటున్నారు. జగన్‌ మోహన్‌రెడ్డిని సీఎంగా చూడాలన్నది మా నాన్న కల. పార్టీ కోసం ఆయన అహర్నిశలు ప్రచారం కూడా చేశారు. మీడియా, రాజకీయ నాయకులకు మనవి చేస్తున్నా..! అధికార పెద్దలు కొందరు మా నాన్న హత్యపై ఇష్టానుసార వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయ నాయకులకు, మీడియాకు తనది ఒకటే విన్నపమని, తన తండ్రి ఇప్పటికీ బ్రతికి ఉంటే ఎలాంటి గౌరవం చూపుతారో… ఇప్పుడు కూడా అదే తరహాలో వ్యవహరించాలని ఆమె అభ్యర్థించారు.

వివేకా హత్య దర్యాప్తు ను స్వతంత్ర సంస్థకు అప్పగించండి.. హై కోర్టు లో జగన్ పిటిషన్..!!

Leave A Reply

Your email address will not be published.