Skyscraper left
Skyscraper Right

T20 సిరీస్ ఆస్ట్రేలియా సొంతం.. కోహ్లీ, ధోని ల రికార్డ్స్..!!

నిన్న జరిగిన T20 మ్యాచ్ లో టీం ఇండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే.. ధోని, కోహ్లీ, కెఎల్ రాహుల్ ల బాధ్యతాయుత ఇన్నింగ్స్ టీం ఇండియా ని గట్టెక్కించలేకపోయింది.. పసలేని బౌలింగ్ తో , మాక్స్ వెల్ మెరుపు ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియా సునాయాసంగా గెలిచి సిరీస్ ని చేజిక్కించుకుంది.. అయితే ఈ మ్యాచ్ ద్వారా కెప్టెన్ కోహ్లీ, ధోని లు తమ ఖాతాల్లో కొన్ని రికార్డులను నమోదు చేసుకున్నారు..
ఈ మ్యాచ్ లో కోహ్లీ కేవలం 38 బంతుల్లో 72 పరుగులు చేయగా ఆఖరి బంతికి సిక్స్ కొట్టి తనదైన శైలి లో మ్యాచ్ ను ముగించాడు. అయితే మ్యాచ్ ఆద్యంతం కోహ్లీ తన చేతివాటంతో సిక్సర్ల మోత మోగించాడు.. ఈ మ్యాచ్ లో కోహ్లీ మొత్తం 6 సిక్సరులు బాదిన కోహ్లీ ఒకే మ్యాచ్ లో తాను అత్యధికంగా 6 సిక్సులు కొట్టడం ప్రధమం.. అలాగే చిన్నస్వామి స్టేడియం లో ఎక్కువ సిక్సులు కొట్టిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు..
అలాగే T20 ల్లో అత్యధిక హాఫ్ సెంచరీ లు చేసిన రోహిత్ (20) సరసన నిలిచాడు కోహ్లీ (20)..  అలాగే ఈ మ్యాచ్ తోనే T20 ల్లో 2500 పరుగులు పూర్తి చేసుకున్నాడు.. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ నేతృత్వంలో స్వదేశంలో ఓడిన T20 సిరీస్ కూడా ఇదే.. మొత్తం కోహ్లీ నేతృత్వంలో 16 సిరీస్ లు అడ్డాగా, 14 సిరీస్ లు గెల్చుకుని మరో సిరీస్ ని డ్రా చేసుకుని , ఈ సిరీస్ ని కోల్పోయింది..

Leave A Reply

Your email address will not be published.