Skyscraper left
Skyscraper Right

ఉమేష్ యాదవ్ పై ఫాన్స్ ఆగ్రహం.. చెత్త బౌలింగ్ అంటూ విమర్శలు..!!

నిన్న జరిగిన ఇండియా , ఆస్ట్రేలియా T20 మ్యాచ్ లో భరత్ తృటిలో మ్యాచ్ ను చేజార్చుకుంది.. మొదటినుంచి తనదేపైచేయి గా కనిపించిన ఆస్ట్రేలియా చివరి ఓవర్లలో తడబడే సరి కి మ్యాచ్ ఒక్కసారిగా భారత్ వైపు మళ్లింది.. 19 వ ఓవర్ వరకు టీం ఇండియా దే మ్యాచ్ అనుకున్నారు.. కానీ ఇక్కడే విరాట్ కోహ్లీ తప్పిదం చేశాడు.. ఉమేష్ యాదవ్ లాంటి భారీగా పరుగులు సమర్పించుకునే బౌలర్ చేతికి బంతి ఇచ్చి మ్యాచ్ ని చేజేతులా ఆస్ట్రేలియా కి సమర్పించాడు..

చివర్లో 14 పరుగులు చేయాల్సి రాగ, ఆస్ట్రేలియా వైపు సరైన బ్యాట్స్ మన్ లేకపోవడంతో ఇండియా దే గెలుపు అనుకున్నారు అంతా కానీ వాళ్ళు 14 పరుగులు అవలీలగా కొట్టేయడంతో ఆస్ట్రేలియా మ్యాచ్ ని ఎగరేసుకుపోయింది. దీంతో అభిమానులు ఉమేష్ యాదవ్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.. ఎంతో కష్టపడి చివరిదాకా తెచ్చిన మ్యాచ్ ని చేజేతులా నాశనం చేశాడని తిడుతున్నారు.. నిర్ణీత ఇరవై ఓవర్లకు టీం ఇండియా 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా చివరిబంతి రెండు పరుగులు చేసి విజయం సాధించింది..

Leave A Reply

Your email address will not be published.