Skyscraper left
Skyscraper Right

పాకిస్థాన్ లీగ్ లో ఆడే ఐపీఎల్ ఆటగాళ్లను బ్యాన్ చేస్తారా..!!

పుల్వామా ఉగ్రదాడి లో పాకిస్థాన్ ది ప్రధాన పాత్ర ఉందని తేలడంతో భారత ప్రభుత్వం పాక్ పై అన్ని విధాలా వేటు పడే దిశగా పావులు కదుపుతుంది.. ఇప్పటికే ప్రపంచకప్ లో పాక్ తో ఆడే ఆటను రద్దు చేసుకోవాలని బీసీసీఐ కి సిఫార్సు చేయగా ఈనెల 25 న గానీ, 27 న గానీ ఆ విషయం ఏమైంది తేలనుంది.. ఇక ఐపీఎల్ లో పాక్ ఆటగాళ్ల నిషేధం ఎప్పటినుంచో జరగగా, తాజాగా మరో సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది..

ఇండియా లో ఐపీఎల్ లానే పాక్ లో PSL అనే క్రికెట్ లీగ్ ఏటా జరుగుతుంది.. ఆ లీగ్ లో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా మ్యాచ్ లు ఆడుతూ ఉంటారు.. అయితే ఇక్కడ అక్కడ రెండిట్లో ఆడే ప్లేయర్స్ పై బీసీసీఐ వేటు వేయనుంది.. అంటే అటు PSL లో ఇటు ఐపీఎల్ లోఆడే ఆటగాళ్లపై వేటు వేసి తమ నిరాశానని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయనుంది ఇండియా.. అయితే రెండు లీగ్స్ లో ఆడే ఆటగాళ్లలో స్టార్ ఆటగాళ్లు ఉండడం గమనార్హం.. ఆ జాబితాలో గేల్, కొలిన్ మన్రో, ఇంగ్రామ్, పోలార్డ్, సునీల్ నరైన్, వాట్సన్, డివిలియర్స్, బ్రెత్ వైట్, రస్సెల్ వంటి ఆటగాళ్లు ఉండగా వారు ఈ పరిసత్తిని ఎదుర్కొని ఏ లీగ్ లో ఆడటానికి సముఖంగా ఉంటారో చూడాలి..

Leave A Reply

Your email address will not be published.