Skyscraper left
Skyscraper Right

చిత్తుగా ఓడిన భారత్.. కొట్టొచ్చినట్లు కనపడిన విరాట్,ధోని ల లోటు..!!

హామిల్టన్ వన్ డే లో టీం ఇండియా చిత్తుగా ఓడింది.. మూడు వన్డే ల్లో న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించిన భారత్ నాలుగో వన్ డే లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన మొదటి నుంచి న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది.. ఓపెనర్లు ఎక్కువ సేపు నిలవలేకపోయారు.. మిడిల్ ఆర్డర్ కూడా ఏ తరుణంలో పోటీని ఇవ్వలేకపోయారు.. దాంతో ఈ మధ్య కాలంలో టీం ఇండియా చేయనటువంటి అత్యల్ప స్కోర్ నమోదు చేసింది.. 93 పరుగులకే ఆల్అవుట్ అయ్యి చెత్త రికార్డు ను నమోదు చేసుకుంది.. ఇప్పటివరకు ఇండియా చేసిన అత్యల్ప స్కోర్స్ లో ఇది 7వది.. ఓవరాల్ గా ఇండియా శ్రీలంక చేతిలో 54 పరుగులకే ఆల్ అవుట్ అయ్యి అత్యల్ప స్కోర్ నమోదు చేసింది.. ఇక న్యూజిలాండ్ లో బౌలింగ్ తో అదరగొట్టిన బౌల్ట్ 5 -21 కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.. భారత్ బ్యాట్స్ మాన్ లలో చాహల్ చేసిన 18 పరుగులే అత్యధిక పరుగులు కావడం విశేషం.. అటు న్యూజిలాండ్ రెండు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది..

Leave A Reply

Your email address will not be published.