Skyscraper left
Skyscraper Right

ధోని సరసన రోహిత్ శర్మ..!!

ప్రస్తుతం టీం ఇండియా లో సెహ్వాగ్ ని తలపించే బ్యాట్స్ మ్యాన్ ఎవరంటే ఖచ్చితంగా రోహిత్ శర్మ అని అంటారు.. ఎందుకంటే అవే సిక్సులు , అవే ఫోర్ లు ఎవరు ఊహించని టైం లో కొత్తకూడాని టైం లో కొడతాడు కాబట్టి.. రోహిత్ శర్మ ఆట మొదట్లో నెమ్మదిగా ఆడిన ఆ తర్వాత వేగం పెంచి సిక్సులు మీద సిక్సులు కొడుతుంటాడు.. అపోజిట్ టీం ఏదైనా తనదైన శైలి లో సిక్సులు మోత మోగాల్సిందే.. అయితే తాజాగా న్యూజిలాండ్ లోనూ అదే వీరోచితంగా ఆటను కొనసాగిస్తున్నాడు రోహిత్.. సిక్సులతో విరుచుకుపడుతున్నారు.. న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్ డే లో రోహిత్ రెండు సిక్సులు బాదగా, ఆ సిక్సులతో ధోని సరసన చేరిపోయాడు రోహిత్.. ఇప్పటివరకు ధోని పేరిట (215) సిక్సుల రికార్డును రోహిత్ సమం చేశాడు.. త్వరలో ఆ రికార్డును దాటిపోతాడు కూడా ఇక రోహిత్ కి పైన అత్యధిక సిక్సుల రికార్డు ఆఫ్రిది కి ఉంది.. 351 సిక్సులతో ఆఫ్రిది టాప్ ప్లేస్ లో ఉండగా తర్వాత గేల్, సనత్ జయసూర్య , రోహిత్, ధోని తర్వాతి స్థానాల్లో ఉన్నారు..

Leave A Reply

Your email address will not be published.