Skyscraper left
Skyscraper Right

ఒక్క మ్యాచ్ తో అంతా తలకిందులు. టీం ఇండియా కి వరల్డ్ కప్ కొట్టే సత్తా ఉందా..!!

న్యూజిలాండ్ తో తొలి మూడు మ్యాచ్ ల్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న టీం ఇండియా నాలుగో మ్యాచ్ లో 92 పరుగులకే ఆలౌట్ అయ్యి చెత్త రికార్డు ను నమోదు చేసుకుంది.. దాంతో టీం ఇండియా పై అప్పటివరకు ఉన్న నమ్మకం అంత ఇప్పుడు తేలి పోయింది.. టాప్ ఆర్డర్ స్ట్రాంగ్ గానే ఉన్నా మిడిల్ ఆర్డర్ లో బ్యాట్స్ మన్ చాల వీక్ గా ఉన్నారని మరోసారి స్పష్టమైంది.. రాయుడు, కార్తిక్, జాదవ్, కె.ఎల్ రాహుల్ , ధోని మిడిల్ ఆర్డర్ లో ఆడుతుండగా వీరిలో ధోని మినహా ఎవరికీ స్థిరీకరణ లేకపోవడం గమనించాల్సిన విషయం.. జాదవ్, కార్తీక్ మెరుపులు అవసమైనప్పుడు మెరవకపోవడం తో వారి పై నమ్మకం లేకుండా పోతుంది.. ఇక అల్ రౌండర్ పాండ్య బౌలింగ్ లో పర్వాలేదనుకున్న బ్యాటింగ్ మెరుపులు మొదట్లో ఉన్నట్లు కనిపించట్లేదు.. దాంతో ఇతనిపై కూడా పెద్దగా నమ్మకం పెట్టుకునే ఆలోచనలో క్రికెట్ అభిమానులు లేరు.. వరల్డ్ కప్ ఎంతో దూరం లేదు, దాదాపు ఇదే టీం తోనే వరల్డ్ కప్ కి టీం ఇండియా వెళ్తుంది.. ఇలాంటి స్థిరత్వం లేని మిడిల్ ఆర్డర్ తో వరల్డ్ కప్ కొట్టగలదా అనేదే ఇక్కడ అసలు ప్రశ్న..

Leave A Reply

Your email address will not be published.